Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"వచ్చాడయ్యో సామి'' అంటున్న మహేష్ బాబు (టీజర్ సాంగ్)

ప్రిన్స్ మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం ఈనెల 20వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Advertiesment
, మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:00 IST)
ప్రిన్స్ మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రం ఈనెల 20వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే సినిమాలోని ఒక్కో సాంగ్ టీజర్‍ని రిలీజ్ చేస్తున్న యూనిట్.. మంగళవారం మరో సాంగ్ టీజర్‍ని విడుదల చేసింది.
 
"వచ్చాడయ్యో సామి'' అనే వీడియో సాంగ్ టీజర్‌ని ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని తనకిష్టమైన మరో సాంగ్ అని ట్విట్ చేశాడు మహేష్. 40 సెకన్లున్న ఈ వీడియో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ని 'అన్నా' అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా : సినీ నటి శ్రీరెడ్డి