Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలీజ్‌కి ముందే భ‌ర‌త్ అనే నేను సెన్సేష‌న్..!

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బ‌ష్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే...భరత్ అనే నేను అంటూ మ‌హేష్ రిలీజ్‌కి ముందే రికార్డు బ్రేక్

Advertiesment
రిలీజ్‌కి ముందే భ‌ర‌త్ అనే నేను సెన్సేష‌న్..!
, సోమవారం, 16 ఏప్రియల్ 2018 (15:44 IST)
సూప‌ర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బ‌ష్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే...భరత్ అనే నేను అంటూ మ‌హేష్ రిలీజ్‌కి ముందే రికార్డు బ్రేక్ చేసాడు. వరల్డ్ వైడ్‌గా 2000 థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్టు చిత్ర బృందం తెలియ‌చేసింది. 
 
మహేష్ బాబు సీఎం క్యారెక్టర్లో నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోగా, అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్యకు మించి ఈ సినిమాను విడుదల చేస్తుండ‌టం విశేషం. 1000 సినిమా హాల్స్‌లో చిత్రం విడుదలవుతుందని తెలిపింది. అంటే బాహుబలి-2కు సమానంగా భరత్ అనే నేను విడుదల కానుంది. 
 
యు.ఎస్‌లో సినిమాకు హిట్ టాక్ వస్తే.. తొలి వీకెండ్‌లో 3 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్స్ వస్తాయని సినీ పండిత‌లు అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్ రావచ్చని కూడా భావిస్తున్నారు. కాగా, ఇండియాలో సైతం బుక్ మై షో వంటి వెబ్‌సైట్లలో సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభం కాగా, తొలిరోజు టికెట్లు హాట్‌కేక్స్‌లా అమ్ముడవుతున్నాయి. దీన్నిబ‌ట్టి చూస్తుంటే... భ‌ర‌త్ అనే నేను తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డం ఖాయం అనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డి సెల్ ఫోనుకు 10 లక్షల మెసేజ్‌లు.. ఏమనో తెలుసా?