Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుక్కు నెక్ట్స్ మూవీకి హీరో ఫిక్స్... ఈ సారి 'లెక్క' తప్పదట

సుకుమార్... అటు ప్రేక్ష‌కాభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోను ఇప్పుడు మారు మోగుతోన్న పేరు ఇది. ఈ లెక్క‌ల మాస్ట‌ర్ లెక్క త‌ప్ప లేదు. లెక్క క‌రెక్ట్ అయ్యింది. 'రంగ‌స్థ‌లం' క‌న‌క్ట్ అయ్యింది. అంతే... ఊహించ‌

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:57 IST)
సుకుమార్... అటు ప్రేక్ష‌కాభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోను ఇప్పుడు మారు మోగుతోన్న పేరు ఇది. ఈ లెక్క‌ల మాస్ట‌ర్ లెక్క త‌ప్ప లేదు. లెక్క క‌రెక్ట్ అయ్యింది. 'రంగ‌స్థ‌లం' క‌న‌క్ట్ అయ్యింది. అంతే... ఊహించ‌ని విధంగా 'బాహుబ‌లి' త‌ర్వాత తెలుగులో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ సాధించింది. దీంతో సుకుమార్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది హాట్ టాపిక్ అయ్యింది. బ‌న్నీ, అఖిల్ పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ... ఇవేవి కాద‌ని తెలిసింది.
 
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... సుక్కు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో త‌న నెక్ట్స్ మూవీ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. 
మ‌హేష్‌తో సుకుమార్ "1 నేనొక్క‌డినే" అనే సినిమాని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్స‌స్ సాధించ‌క‌పోయినా... డిఫ‌రెంట్ మూవీగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. డైరెక్ట‌ర్ సుకుమార్ని 1 సినిమా గురించి ఎప్పుడు అడిగినా... ఈ సినిమా నిర్మాణ స‌మ‌యంలో ఇంకొంచెం టైమ్ ఉండుంటే.. కొన్ని మార్పులు చేసేవాడిని. స‌క్స‌స్ అయ్యేది అని చెబుతుంటారు. 
 
అంతేకాకుండా... మ‌హేష్‌తో సినిమా చేస్తాను. ఈసారి ఖ‌చ్చితంగా హిట్ ఇస్తాను అని చెబుతుంటారు. ఇప్పుడు సుకుమార్ మ‌హేష్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నార‌ట‌. ఇటీవ‌ల మ‌హేష్‍కి లైన్ చెప్ప‌గా.. బాగుంది ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. మ‌హేష్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందే చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. మ‌హేష్ 25వ సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఆత‌ర్వాత మ‌హేష్ సుకుమార్‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments