నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణతో పాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
గోవా వేదికగా జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో బాలకృష్ణను సత్కరించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన పలు మీడియా ఛానల్స్‌తో మాట్లాడుతూ, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆదిత్య 369 సీక్వెల్‌గా ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో తన కొడుకుతో కలిసి నటించబోతున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఈ విషయాన్ని బాలయ్య తెలిపిన వెంటనే నందమూరి అభిమానుల్లో భారీ హైప్ మొదలైంది. ఆదిత్య 999 మ్యాక్స్ వంటి పెద్ద కాన్సెప్ట్ ఉన్న సినిమాతో మోక్షజ్ఞ డెబ్యూ మంచి నిర్ణయమని అభిమానులు చెబుతున్నారు. ఈ చిత్రం మోక్షజ్ఞ కెరీర్‌కి మంచి ఆరంభం ఇవ్వొచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది త్వరలో తేలనుంది.