ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నగల వ్యాపారి కుమారుడు మద్యం మత్తులో ఓ హోటల్ రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టాడు. ఈ ఘటన నవంబర్ 12న డియోన్ లాడ్జిలో జరిగింది. రిసెప్షనిస్టు అతడిని ఎంతగా నిరోధించినప్పటికీ అతడు ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇది కాస్తా సిసి కెమేరాలో రికార్డయ్యింది. గత ఆదివారం నాడు ఈ వీడియో వైరల్ కావడంతో పాటు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
హోటల్ మేనేజర్ చెప్పిన వివరాల ప్రకారం... నగల వ్యాపారి కుమారుడు అమన్ తమ రెగ్యులర్ కస్టమర్. ఐతే నవంబర్ 12వ తేదీన రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో అతడు రిసెప్షన్ ఏరియాలో రిసెప్షనిస్ట్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బలవంతంగా ఆమె బుగ్గలపై ముద్దులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదేరోజు రాత్రి పోలీసులు తమ హోటల్ వద్దకు వచ్చి ఉద్యోగులను ఘటన గురించి వాకబు చేసారంటూ వెల్లడించారు. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం అతడు బెయిల్ తీసుకున్నాడు.