Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్న మృతితో వితంతువుగా మారిన వదిన.. పెళ్లాడిన మరిది... ఎక్కడ?

Advertiesment
up man marriage

ఠాగూర్

, శుక్రవారం, 21 నవంబరు 2025 (17:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆదర్శ వివాహం జరిగింది. అన్న అగ్నిప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వదిన వితంతువుగా మారింది. వదిన వితంతువుగా ఉండటాన్ని మృతుడు సోదరుడు చూడలేకపోయాడు. దీంతో కుటుంబ సభ్యుల అనుమతి మేరకు వదినను మరిది పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజేశ్ సింగ్ అనే యువకుడి అన్నకు కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. అన్నావదినలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న సమయంలో ఓ అగ్నిప్రమాదం వారి కుటుంబలో విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన భార్య చిన్న వయసులోనే వితంతువుగా మారిపోయింది. దీంతో వదినను పెళ్లాడని రాజేశ్ సింగ్ నిర్ణయించుకున్నాడు. 
 
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించగా, వారు కూడా అంగీకరించారు. ఆ తర్వాత వదినను ఒప్పించి అందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వదినకు కొత్త జీవితాన్ని ఇచ్చిన రాజేశ్‌ సింగ్‌ను స్థానికులతో పాటు నెటిజన్లు అభినందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Indian HAL Tejas jet- దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయిన భారత తేజస్ ఫైటర్ జెట్