Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

Advertiesment
Lovers

సెల్వి

, గురువారం, 20 నవంబరు 2025 (19:15 IST)
ప్రేమిస్తే ఈ మాసాల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి అంటున్నారు జ్యోతిష్యులు. ఈ మాసంలో పుట్టిన మహిళలు ప్రేమ కోసం ప్రాణానైనా ఇవ్వగలరని.. ప్రేమ కోసం ఏమైనా చేయగలరని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. జ్యోతిష్యం ప్రకారం ఈ మాసాల్లో పుట్టిన మహిళలను ప్రేమించడం, వివాహం చేసుకోవడం ఒక వరంగా భావించవచ్చు. 
 
ఆ మాసాలేంటో చూద్దాం.. ఫిబ్రవరిలో జన్మించిన మహిళలు ఇతరుల పట్ల ప్రేమగా వుంటారు. కొత్తదనం వుండాలని అన్వేషిస్తారు. వీరిని ప్రేమించే పురుషులు అదృష్టవంతులు. అందుకే వీరి వైవాహిక సంబంధంలో ఎలాంటి ఇబ్బందులు వుండవు. ఫిబ్రవరిలో జన్మించిన మహిళా జాతకులను ప్రేమించి వివాహం చేసుకునే దంపతులు అన్యోన్యంగా వుంటారు. ఈ జాతకులు ఎప్పుడూ భాగస్వామికి మద్దతిస్తారు. ముఖ్యంగా భాగస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోహం చేయరు.
 
అలాగే మే మాసంలో పుట్టిన అమ్మాయిలు ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఇతరులను ఆకట్టుకునే రీతిలో వీరి ఆధిపత్యం వుంటుంది. వీరి గుణగణాలు, నిజాయితీ ఇతరులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ప్రేమ కోసం పడిచస్తారు. తమను ప్రేమించే వారి కోసం జీవితాన్ని అంకితం చేస్తారు. 
 
ఇకపోతే.. జూలైలో జన్మించిన జాతకులు సునిత మనస్కులు. ప్రేమకే పైచేయిగా నిలుస్తారు. ఇతరులను సంతోషంగా వుంచుకునే గుణం వీరికి వుంటుంది. వీరు భాగస్వామికి పూర్తి మద్దతు ఇస్తారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన అండగా నిలుస్తారు. నిజాయితీగా సమస్యలను పరిష్కరిస్తారు. అందుకే జూలై మాసంలో జన్మించిన మహిళా జాతకులను ప్రేమించడం లేదా వివాహం చేసుకునే వారు అదృష్టవంతులని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...