తమిళనాడులో ప్రియుడితో రీల్స్ చేయొద్దని మందలించిన భర్తను భార్య హతమార్చిన ఘటన తమిళనాడు అరుణాచలంలో జరిగింది. ఆపై తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని డ్రామా చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణాచలం జిల్లా, చేట్‌పట్‌కు చెందిన విజయ్ (27) లారీ డ్రైవర్. ఇతని భార్య షర్మిల (25). వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హన్సిక అనే నాలుగోళ్ల కుమార్తె, ఆజీస్ అనే మూడేళ్ల కుమారుడు వున్నారు.
విజయ్ లారీ డ్రైవర్ కావడంతో బయట రాష్ట్రాలకు అప్పుడప్పుడు వెళ్లడం పది నుంచి 15 రోజులకు ఒక్కసారి ఇంటికి రావడం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో విజయ్‌కి తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. పొరుగింటి వారి నుంచి ఇంటికి ఎవరో వచ్చి వెళ్తున్నారని తెలుసుకున్నాడు.
ఈ విషయంపై భార్యను మందలించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆవేశంలో విజయ్ షర్మిలపై చేజేసుకున్నాడు. దీనిని చూసిన షర్మిల తల్లి అల్లుడిని ఖండించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు షర్మిల తెలిపింది. అయితే విజయ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా జరిపిన విచారణలో.. ప్రియుడితో రీల్స్ చేయడాన్ని విజయ్ ఆపమన్నాడని.. వివాహేతర సంబంధం వద్దని మందలించాడని షర్మిల తెలిపింది. దీంతో భర్త విజయ్‌ని షర్మిల ప్రియుడి సాయంతో హతమార్చినట్లు తేలింది. దీంతో షర్మిలతో పాటు ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.