Naga Chaitanya, Janhvi Narang, Priyadarshi, Anandi, Navneet Sriram
జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ప్రేమంటే. థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది ఉప శీర్షిక. ఈ మూవీలో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించారు. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య మేరుగు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ నవంబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో లవ్ ట్రోట్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ సామ్రాట్ నాగ చైతన్య, సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
నాగ చైతన్య మాట్లాడుతూ .. నారాయణ్ దాస్ కె నారంగ్ గారు, సునీల్ నారంగ్ గార్ల వారసత్వాన్ని జాన్వీ ముందుకు తీసుకు వెళ్తున్నారు. వీరి బ్యానర్‌లో లవ్ స్టోరీ లాంటి మంచి సినిమాను చేయడం, వారి ద్వారానే శేఖర్ కమ్ముల పరిచయం అవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు మళ్లీ ప్రేమంటే అనే లవ్ స్టోరీ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు రావడం ఆనందంగా ఉంది. నవనీత్ గారు మంచి పాయింట్‌తో కొత్త ప్రేమ కథను అందివ్వబోతోన్నారు. ప్రియదర్శి మంచి నటుడు. అన్ని రకాల పాత్రల్ని అద్భుతంగా పోషిస్తున్నారు. ఆనంది గారు కస్టడీ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు. ఆమె మంచి నటి. సుమ గారిని ఇలాంటి ఓ మంచి పాత్రలో చూడటం ఆనందంగా ఉంది. ప్రేమంటే సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నవంబర్ 21న ఈ మూవీని అందరూ చూడండి అని అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ప్రేమంటే టీంకి కంగ్రాట్స్. ప్రియదర్శిని చాలా ఏళ్ల నుంచి గమనిస్తూనే ఉంటున్నాను. ఆయనెప్పుడూ మంచి కథల్నే ఎంచుకుంటూ ఉంటారు. నవనీత్ ఈ మూవీతో మంచి విజయం దక్కాలి. ఆనంది అద్భుతమైన నటి. ఆమె నటించిన చిత్రాలెన్నో చూశాను. యంగ్ టాలెంట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వస్తోంది. ప్రేమంటే చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ .. నవనీత్ చెప్పిన కథ విని చాలా సంతోషంగా అనిపించింది. కథ విన్న వెంటనే జాన్వీ గారికి ఫోన్ చేసి చెప్పాను. సునీల్ నారంగ్ గారికి జాన్వీ గారంటే చాలా ఇష్టం. నారాయణ దాస్ గారు చాలా గొప్ప వ్యక్తి. నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలందించిన గొప్పవారాయన. జాన్వీ గారి నేతృత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో మంచి పాత్రను పోషించిన సుమ గారికి థాంక్స్. ఆనంది గారి నటనకు నేను పెద్ద అభిమానిని. ఆమె అద్భుతమైన నటి. విశ్వ విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. ఈ మూవీకి లియోన్ గారి మ్యూజిక్ ప్రధాన బలం. కో ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి చాలా ఓర్పు, సహనం ఉంటుంది. మా కోసం వచ్చిన నాగ చైతన్య గారికి, శేఖర్ కమ్ముల గారికి థాంక్స్. ఈ మూవీకి పని చేసిన, సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందమైన కథతో తెరకెక్కిన నవంబర్ 21న ప్రేమంటే రాబోతోంది అన్నారు.