సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఓ ప్రబుద్ధుడు ఏకంగా కన్నతల్లినే ఎరగా పెట్టాడు. కన్నతల్లితో కలిసి బ్యాంకు మేనేజర్‌ను హనీ ట్రాప్‌లో ఇరికించాడు. తన తల్లితో ఆ బ్యాంకు మేనేజరు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే, బ్యాంకు మేనేజరు అసలు విషయాన్ని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లీ కుమారులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ఇండి పట్టణంలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండి పట్టణంలోని ఒక బ్యాంకు మేనేజరుకు కొద్ది రోజల క్రితం కొబ్బరి బొండాలు విక్రయించే 44 యేళ్ళ మహిళతో పరిచయమైంది. బ్యాంకు పక్కనే కొబ్బరి బొండాలు అమ్ముతుండటంతో ఆ మహిళతో మరింతగా సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని మేనేజర్‌ను హనీట్రాప్‌లో ఇరికించేందుకు మహిళ కొడుకు (24) కుట్ర చేశాడు. ఇందుకు కన్నతల్లి కూడా పూర్తిగా సహకరించింది.
ఈ తల్లీకొడుకుల పథకం మేరకు ఈ నెల ఒకటో తేదీన ఆ మహిళ బ్యాంకు మేనేజరును తన ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో తాను మాత్రమే ఉంటాని, సరదాగా గడుపుదామని నమ్మించింది. ఇంటికి వచ్చిన్ బ్యాంకు మేనేజరుతో ఆమె ఏకాంతంంగా ఉన్న సమయంలో కిటికీలో మొబైల్ ఫోను పెట్టింది.
దీన్ని గమనించిన బ్యాంకు మేనేజరు ఆ మహిళను ప్రశ్నించగా, ఆ మొబైల్ పాడైపోయిందని చెప్పి, తనతో ఏకాంతంగా గడిపేలా ప్రోత్సహించింది. ఆ తర్వాత నాలుగు రోజుల తర్వాత మేనేజర్‌కు ఫోన్ చేసి.. మనమిద్దరం ఏకాంతంగా గడిపిన సంఘటనను గుర్తు తెలియని వ్యక్తులు రికార్డు చేశారని, ఆ వీడియోలు పంపించి బెదిరిస్తున్నారని నాటకమాడింది. పైగా వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించింది.
ఆ తర్వాత ఆ బ్యాంకు మేనేజరుకు ఆ మహిళ, ఆమె కుమారుడు, ఓ పత్రికా విలేఖరి కలిసి ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారు. తాము అడిగిన డబ్బు ఇవ్వకుంటే వీడియోను బహిర్గతం చేస్తామని బెదిరించారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన బ్యాంకు మేనేజరు.. పోలీసులను ఆశ్రయించాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో ఈ హనీట్రాప్‌కు పాల్పడింది తల్లీకుమారుడుతో పాటు మరో పత్రికా విలేకరి అని గుర్తించి, వారిని అరెస్టు చేశారు.