Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌య్యా.. ఇక‌నైనా మార‌య్యా..!

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (17:52 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం రూల‌ర్. ఈ సినిమాని త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్. ర‌వి కుమార్ తెర‌కెక్కించారు. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి జై సింహ అనే సినిమా చేసారు. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌క‌పోయినా... ఫ‌ర‌వాలేద‌నిపించింది... యావ‌రేజ్‌గా నిలిచింది. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రూల‌ర్ అనే సినిమా వ‌స్తుంద‌ని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి బాగానే ఉండ‌చ్చు అనే పాజిటివ్ టాక్ ఏర్ప‌డింది.
 
అయితే... రూల‌ర్  ట్రైల‌ర్.. ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత మ‌రో ట్రైల‌ర్ రిలీజ్ చేసారు ఈ ట్రైల‌ర్ కూడా అంతే. మెప్పించ‌లేక‌పోయింది. ఇలా.. ట్రైల‌ర్ తో మెప్పించ‌లేక‌పోయిన రూల‌ర్ థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడులో ఎన్నో ప్ర‌శ్న‌లు. ఈ క‌థ‌ను ఎలా ఎంచుకున్నారు..? ఇప్పుడు ద‌ర్శ‌కులు, హీరోలు అప్ డేట్ అవుతుంటే... బాల‌య్య ఏమాత్రం అప్ డేట్ కాకుండా ఇలా పాత క‌థ‌ల‌ను ఎందుకు ఎంచుకుంటున్నారు..?
 
పోలీసాఫీస‌ర్ అంటే ఎలా ఉండాలి..?  ఆయ‌న గెట‌ప్ ఏంటి..?  ఆ హెయిర్ స్టైల్ ఏంటి..? లింకులు లేకుండా స‌డ‌న్ గా వ‌చ్చే ఆ పాట‌లేంటి..? ఇలా ఎన్నో ఎన్నో ప్ర‌శ్న‌లు. హీరో ఉన్నాడు, డ‌బ్బులు పెట్టే నిర్మాత ఉన్నాడు. ఇప్పుడు మ‌నం ఏదో ఒక సినిమా చేసేయాలి అని రూల‌ర్ సినిమా చేసిన‌ట్టు ఉంది త‌ప్పా.. ఎక్క‌డా కూడా సిన్సియ‌ర్‌గా సినిమా చేసిన ఫీలింగ్ ఆడియ‌న్ కి ఏ స‌న్నివేశంలో కూడా అనిపించ‌దు.

బాల‌య్య మాత్రం త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసాడు. డ్యాన్సుల్లో అయితే అద‌ర‌గొట్టేసాడు కానీ.. ఏ ప్ర‌యోజనం అర్ధం ప‌ర్థం లేని క‌థ‌ను ఎంచుకున్నాడు. బాల‌య్యా.. ఇక నైనా మార‌య్యా..! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments