ఇటీవలే కాశ్మీర్ లో తీవ్రవాదుల దాడిలో పోరాటి అశువులు బాసిన జవాన్ జస్వంత్ రెడ్డికి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ బాపట్లకు చెందిన జవాన్ చిన్నవయసులోనే అమరుడు అవ్వడం ఎంతో దురదృష్టకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.జమ్ము కాశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడి, దేశాన్ని రక్షిస్తూ వీరమరణం చెందిన జశ్వంత్ కు భారతదేశం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది అపి పేర్కొన్నారు.
బాలకృష్ణ బాధ్యతాయుతమైన ఎ.ఎల్.ఎ.గా వున్నారు. ఇప్పటికే కరోనా సమయంలో ఆయన నియోజకవర్గంతోపాటు పలు చోట్ల ప్రజలకు సాయం చేస్తూనే వున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన నటిస్తున్న తాజా సినిమా అఖండ. ఇదికూడా దేశంలోని ద్రోహుల భరతం పట్టే కథతో రూపొందుతోంది. ఇప్పటికే బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు విజయవంతమయ్యాయి. కరోనా తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు మంచి క్రేజ్ వుంది.