Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జమ్మూకాశ్మీర్‌లో నలుగురు లష్కర్ ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్‌లో నలుగురు లష్కర్ ఉగ్రవాదుల హతం
, శుక్రవారం, 9 జులై 2021 (11:37 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు నిషేధిత లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)కి చెందినవారిగా గుర్తించారు. 
 
భద్రతా బలగాల సమాచారం మేరకు... హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఐదో వర్థంతి సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చంధంగా బంద్ పాటించారు. 
 
ఈ నేపథ్యంలో పుల్వామా జిల్లాలోని పుచాల్‌ ప్రాంతంలో ముష్కరుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వీరి రాకను గమనించిన ముష్కరులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపాల్సి వచ్చింది. కొంతసేపటి తర్వాత ఉగ్రవాదుల వైపునుంచి కాల్పులు ఆగిపోయాయి.
 
ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి చూడగా, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు లష్కరే తోయిబాకు చెందిన కిఫాయత్‌ రంజాన్‌ సోఫీ, అల్‌ బదర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇనాయత్‌ అహ్మద్‌ దార్‌గా గుర్తించారు. 
 
ఇకపోతే, కుల్గామ్‌ జిల్లాలో జాతీయ రహదారిపై ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
 
ఇందులో వున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉద్దరు ఉగ్రవాదులు మరణించారు. మృతులు లష్కరే తోయిబాకు చెందిన నాసిర్‌ అహ్మద్‌ పండిత్, షాబాజ్‌ అహ్మద్‌ షాగా గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి కాస్త కోవర్ట్ రేడ్డిగా మారిపోయారు : ఎమ్మెల్యే రోజా కౌంటర్