Webdunia - Bharat's app for daily news and videos

Install App

`ల‌క్ష్యం` వైపు గురిపెడుతున్న నాగ‌శౌర్య

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:07 IST)
Nagashourya
నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న నాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’. ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌లుక్‌లో క‌నిపించనున్నారు నాగ‌శౌర్య‌.
 
సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు.
 
ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇత‌ర‌నటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్ష‌కుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్‌.
 
ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన మేకింగ్ వీడియోలో నాగ‌శౌర్య త‌న లక్ష్యాన్నిఛేదించ‌డానికి సిద్ద‌మ‌వడం మనం చూడొచ్చు. నిజానికి విలువిద్య‌కు తీక్షణమైన దృష్టి, క్రమశిక్షణ మరియు అగ్రశ్రేణి ఏకాగ్రత అవసరం.
నాగ‌శౌర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమా ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌మీద అంఛ‌నాలు పెరిగాయి. 
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి
నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్,  సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి, సంగీతం: కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్దిఖీ, డైలాగ్స్‌: సృజ‌న‌మ‌ణి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments