Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి త‌రం విజ్ఞానాన్ని ప‌ట్టారు - జ్ఞానాన్ని వదిలేశారుః కోట శ్రీ‌నివాస‌రావు

webdunia
శనివారం, 10 జులై 2021 (12:44 IST)
kota Srinivasa Rao
పెద్ద‌ల‌మాట స‌ద్దిమూట అంటారు. ఆ పెద్ద‌ల మాట వినేవారు నేడు క‌రువ‌య్యారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ ఎద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అలా ప్ర‌శ్నించ‌డం క‌రెక్టే కాన్ని దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డంలేదంటూ సినీ పెద్ద, 77 ఏళ్ళ కోట శ్రీ‌నివాస‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నేడు ఆయ‌న జ‌న్మ‌దినం. కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. అదే ఆయ‌న్ను బేంక్ ఉద్యోగం చేసినా స్థిరంగా వుంచేదికాదు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ టీవీ ఛాన‌ల్‌కు చెప్పిన విశేషాల్లో కొన్ని మీకోసం.
 
మీరు బిజీగా ఎన్ని ఏళ్ళు ప‌నిచేశారు?
బిజీ అనేకంటే గ‌జిబిజీ అంట‌. రోజుకు మూడు రాష్ట్రాల‌లో ప‌ర్య‌టించి న‌టించేవాడిని. ప‌గ‌లు హైద‌రాబాద్‌లో, సాయంత్రం చెన్నై, రాత్రి బెంగుళూరు ఇలా మూడు షిప్ట్‌లుగా దాదాపు 30 ఏళ్ళ ప‌నిచేశాను. రాత్రి ప‌నిచేశాక తెల్లారి ఎయిర్ పోర్ట్‌లో దిగి అక్క‌డే స్నానాది కార్య‌క్ర‌మాలు పూర్తి చేసేవాడిని. మ‌ర‌లా హైద‌రాద్‌లో షూటింగ్‌.
బేంక్ ఉద్యోగి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు విశ్లేషించుకుంటే ఏమ‌నిపించేది?
బేంక్‌లో ఉద‌యం 10 నుంచి 1గంట‌లవ‌ర‌కు ,మ‌ర‌లా 2 నుంచి ఐదు గంట‌ల‌వ‌ర‌కు ఉద్యోగం. ప్ర‌పంచం తెలీదు. ఇంటికి వెళ్లిపోవ‌డ‌మే. మ‌ర‌లా రేపు రొటీన్‌గా ఉద్యోగం. ఎందుక‌నో బోర్ కొట్టేది. నాట‌కాలు ఆడాక‌. అది సినిమాల్లోకి తీసుకువ‌చ్చాక‌. ఈ బిజీలైఫ్ చూస్తుంటే దేవుడు నాకు ఇలా అవ‌కాశం ఇచ్చాడు. అని కృత‌జ్ఞ‌త తెలుపుకునేవాడిని.
 
webdunia
mayabazar-bahubali
తెలుగు సినిమా బాహుబ‌లి త‌ర్వాత ఎలా అనిపిస్తుంది మీకు?
నేను విమ‌ర్శించ‌డంకాదుకానీ. రాజ‌మౌళి, వారి నాన్న‌గారిని ఏమ‌నుకోవ‌ద్దు. నా ప‌రిశీన‌ల‌లో వున్న‌ది చెబుతున్నా. బాహుబ‌లి సినిమా రిలీజ్‌కుముందు ఆరునెల‌లు పెద్ద ప్ర‌చారం జ‌రిగింది. బాత్‌రూమ్‌లోకి వెళ్ళినా ఇదే గుప్పేశారు. ఇక రిలీజ్ త‌ర్వాత బాగా ఆడింది. కానీ  ఆ త‌ర్వాత ఎవ‌రైనా త‌ల‌చుకున్నారా? మ‌రి అదే అప్ప‌టి `మాయాబ‌జార్` సినిమా ఇప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్‌. టీవీలో వ‌స్తుంటే ఆరేళ్ళ పిల్ల‌వాడినుంచి 80 ఏళ్ళ‌వారికి వ‌ర‌కు ఆస‌క్తిగా చూస్తుంటారు.
ఆ సినిమాలో వంగ‌ర సుబ్బ‌య్య‌, అల్లురామ‌లింగ‌య్య‌గారు తాంబూలం వేసుకుంటుంటే వారు కూర్చున్న ప‌ట్టా ఎగురుతుంది. మంచం గిరగిరా తిరుగుతుంది. చెప్పులు వాటంత‌టవే మంచంపైకి వ‌స్తాయి. ఇలా ఎన్నో వున్నాయి. అదంతా ట్రిక్ ఫొటోగ్ర‌ఫీ. ఎంత గొప్ప‌గా తీశారు. ఆ ట్రిక్ తెలీయ‌కూడ‌దు. అప్పుడే ఎట్రాక్ష‌న్‌. ఇప్పుడు అలాంటి షాక్ తీయాలంటే కోటిరూపాయ‌లు మినిమం ఖ‌ర్చ‌వుతుంది.
 
ఈత‌రం సినిమాలు చూస్తుంటే మీకేమ‌నిపిస్తుంది?
మా త‌రం కంటే ఒక ప‌దేళ్ళ క్రితం వ‌ర‌కు సినిమా అనేది త‌ల్లిపాలు లాంటిది. ఇప్పుడు డ‌బ్బా పాలుగా మారిపోయింది. అప్పుడు పాట‌ల్లో మాట‌ల్లో సాహిత్యం, అర్థం ఉట్టి ప‌డేవి. సంగీతంలో మైమ‌రిపించేవిగా వుండేవి. ఇప్పుడు భిన్నంగా మారింది. ఇప్ప‌టి త‌రాన్ని ప‌రిశృలిస్తే వారిలో సాధ‌న త‌క్కువ వాద‌న ఎక్కువ‌గా త‌యారైంది. ఇప్ప‌టి త‌రం విజ్ఞానం పేరుతో ఎంతో ఎదిగారు. కానీ జ్ఞానాన్ని వ‌దిలేశారు. దానివ‌ల్లే చిన్న విష‌యం కూడా వారికి వింత‌గా అనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

'బాహుబలి-2' రికార్డును బ్రేక్ చేసిన అజిత్.. ఎలా..?