Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నారప్ప ఫస్ట్ లిరికల్ `చలాకి చిన్నమ్మీ..` వ‌చ్చేస్తోంది

నారప్ప ఫస్ట్ లిరికల్ `చలాకి చిన్నమ్మీ..` వ‌చ్చేస్తోంది
, శుక్రవారం, 9 జులై 2021 (18:05 IST)
Venkatesh
వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.
 
ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది.

ఈ చిత్రం నుండి చలాకి చిన్నమ్మీ.. ఫస్ట్ లిరికల్ సాంగ్ ను జూలై11 ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఇంకా ఈ సినిమాలో కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘స్టాండప్‌ రాహుల్‌’ టీజర్ ఆవిష్క‌రించిన రానా దగ్గుబాటి