Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేతిక శర్మ అధరాలతో 'రొమాంటిక్‌'గా ఆడుకున్న పూరీ తనయుడు

Advertiesment
కేతిక శర్మ అధరాలతో 'రొమాంటిక్‌'గా ఆడుకున్న పూరీ తనయుడు
, సోమవారం, 1 మార్చి 2021 (13:06 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో డాషింగ్ డైరెక్టరుగా పేరుగాంచిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈయన తనయుడు ఆకాష్ పూరీ. "ఆంధ్రా పోరీ" అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో "మెహ‌బూబా" అనే సినిమా చేశాడు. ఇండియా-పాకిస్తాన్ ప్రేమ కథతో తెరకెక్కిన 'మెహబూబా' అంచనాలను అందుకోలేకపోయింది. 
 
దీంతో ఆకాష్ కెరీర్‌క కాస్త బ్రేక్ పడింది. ఇపుడు మూడేళ్ల త‌ర్వాత "రొమాంటిక్" అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాకు కథ మాటలు స్క్రీన్ ప్లే పూరి జగన్నాథ్ అందించగా, ఆయన శిష్యుడు అనిల్ పడూరీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 
 
2019లోనే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా క‌రోనా కారణంగా ఆలస్యమైంది. లాక్డౌన్ త‌ర్వాత మిగ‌తా చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి జూన్ 18న థియేట‌ర్స్‌లోకి ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. కొద్ది సేపటి క్రితం రొమాంటిక్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. 
 
ఇందులో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఒక బీచ్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా పోస్టర్స్‌పై విమర్శలు కూడా వచ్చాయి. మహిళా సంఘాలు గోల గోల చేశారు. ఈ  సినిమాతో హిట్ కొట్టాల‌ని ఆకాశ్ ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్లే బ్యాక్'