Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ‌చైత‌న్య భ‌లే వున్నాడంటున్న స‌మంత‌

Advertiesment
నాగ‌చైత‌న్య భ‌లే వున్నాడంటున్న స‌మంత‌
, శుక్రవారం, 9 జులై 2021 (15:59 IST)
chaitu-ameer-kareena
న‌టి స‌మంత అక్కినేని త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ స్టిల్‌ను సోష‌ల్‌మీడియాలో పెట్టింది. తాజాగా నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ''లాల్‌ సింగ్‌ చద్దా''తో హిందీ తెరంగ్రేటం చేయబోతున్నాడు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం నాగచైతన్య సెట్స్‌లో చేరాడు. ఈ సినిమా షూటింగు లదాఖ్‌లో జరుగుతోంది. క‌రోనా కార‌ణంగా రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు చిత్రీకరణ జరుపుకుంటోంది. 
 
ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా, అమీర్‌ సన్నిహితుడిగా కన్పించబోతున్నాడు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ కూడా నటిస్తోంది. అమీర్‌ఖాన్ ప్రొడ‌క్ష‌న్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ల‌డాక్‌లో ఇప్పుడు మిలట్రీ ప‌ర్మిష‌న్ తీసుకున్న త‌ర్వాత‌నే అమీర్ షూటింగ్ మొద‌లు పెట్టాడు. ఈరోజు స‌మంత ఫొటోను పోస్ట్‌చేస్తూ చైతు డ్రెస్‌లో చాలా బాగున్నాడంటూ మెచ్చుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున సినిమాలో కృతిశెట్టి