Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఘన విజయం.. టీ-20ల్లో జోరు.. బాబర్ అదుర్స్

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (11:55 IST)
పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించింది. ట్వంటీ-20ల్లో పాకిస్థాన్ జోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో త‌న సొంత‌గ‌డ్డ‌పై బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లోనూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ని 2-0తో పాకిస్థాన్ చేజిక్కించుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లా జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 53 బంతుల్లో 65 ప‌రుగులు మినహా మిగిలిన వారెవ్వ‌రూ ధీటుగా రాణించలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది.
 
కానీ 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ కేవలం 16.4 ఓవర్లలోనే సాధించింది. ఓపెనర్ బాబర్ అజామ్ 66 నాటౌట్‌గా నిలిచాడు. అజాబ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో విజృంభించాడు. మరో ఓపెనర్ అలీ మాత్రం 7 బంతుల‌కే డ‌క్ అవుట్ అయ్యాడు.

తొలి టీ20 మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ అజేయ అర్ధశతకంతో పాక్‌ని గెలిపించిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో పాక్‌ 2-0తో సిరీస్‌ను దక్కించుకోగా ఆఖరి మ్యాచ్‌ సోమవారం జరగనుంది.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments