Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టి పాకిస్థాన్ క్రికెటర్.. (video)

Advertiesment
కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టి పాకిస్థాన్ క్రికెటర్.. (video)
, మంగళవారం, 1 అక్టోబరు 2019 (11:17 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు కనుమరుగైపోయింది. ఈ రికార్డును కూడా ఓ పాకిస్థాన్ క్రికెటర్ బద్ధలు కొట్టాడు. అతని పేరు బాబర్ అజం. పాకిస్థాన్ యువ సంచలనం. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటిస్తోంది. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో తన వన్డే కెరీర్‌లో 11వ శతకాన్ని నమోదు చేశాడు. 
 
ఈ ఫీట్ అందుకోవడానికి కోహ్లీకి 82 ఇన్నింగ్స్ పట్టగా... బాబర్ అజం కేవలం 70 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను సాధించాడు. 64 ఇన్నింగ్స్‌లలోనే 11 సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా ఈ జాబితాలో తొలి స్థానంలో వుండగా, మరో సౌతాఫ్రికా ప్లేయర్ డీకాక్ రెండో స్థానంలో (65 ఇన్నింగ్స్) కొనసాగుతున్నాడు. బాబర్ మూడో స్థానానికి చేరుకోవడంతో... కోహ్లీ నాలుగో స్థానానికి దిగజారిపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్కోణపు సిరీస్‌లో మరో రికార్డు.. శ్రీలంక కెప్టెన్ అదుర్స్