ధోనీ రిటైర్మెంట్ ఆయనిష్టం.. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి: గంభీర్

సోమవారం, 30 సెప్టెంబరు 2019 (16:28 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర సమస్యలపై కూడా స్పందించే వ్యక్తి. తాజాగా ధోనీ రిటైర్‌మెంట్‌తో పాటు భారత క్రికెట్‌ జట్టుతో అతని భవిష్యత్తు గురించి గంభీర్ ప్రశ్నించారు. ధోనీ రిటైర్‌మెంట్‌ అనేది తన వ్యక్తిగత విషయమన్నారు. అది పూర్తిగా ఆయన నిర్ణయానికే వదిలేయాలన్నారు.
 
అయితే 2023 ప్రపంచకప్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ను తాను చూస్తానను కోవట్లేదని అభిప్రాయపడ్డాడు. ధోనీ ఆడాలనుకున్నంత కాలం ఆడవచ్చునని చెప్పారు. కానీ ధోనీ ఒకసారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని సూచించారు. వచ్చే ప్రపంచ్‌కప్‌కు ఎవరైతే కెప్టెన్‌గా ఉంటారో వారు ధైర్యంగా ఉండాలన్నారు. తాను ధోనీ గురించి మాత్రమే ఆలోచించట్లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పాకిస్థాన్ క్రికెటర్లకు గట్టి షాక్.. ధోనీకి ఆ విషయం బాగా తెలుసు.. శిఖర్ ధావన్ (video)