Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఒకే ఒక్కడు'... ప్రపంచకప్‌లో వరుసగా 5 అర్థ సెంచరీలు కొట్టిన కెప్టెన్ కోహ్లీ...

Advertiesment
'ఒకే ఒక్కడు'... ప్రపంచకప్‌లో వరుసగా 5 అర్థ సెంచరీలు కొట్టిన కెప్టెన్ కోహ్లీ...
, సోమవారం, 1 జులై 2019 (11:20 IST)
విరాట్ కోహ్లీ ఇటీవలే 20 వేల పరుగుల మైలురాయి దాటి రికార్డు సృష్టించాడు. ఆదివారం ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డ్ సృష్టించాడు. రాహుల్ వికెట్ కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మతో కలిసి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి 76 బంతుల్లో 66 పరుగులు చేశాడు.
 
ఐతే ఈ పరుగులు చేయడం ద్వారా కోహ్లి సరికొత్త రికార్డును సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో ఇండియా నుంచి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 
 
మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కేవలం 18 పరుగులకే ఔటయ్యాడు. ఐతే ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ అర్థ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో 82 పరుగులు, పాకిస్తాన్ పైన 77 పరుగులు, ఆఫ్ఘనిస్తాన్ పైన 67 పరుగులు, వెస్టిండీస్ పైన 72 పరుగులు, ఇంగ్లాండ్ పైన 66 పరుగులు చేశాడు. ఈ ఫీట్ చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించాడు. ఐతే ఈ ఫీట్‌ను 2015 ప్రపంచకప్ పోటీల్లో స్టీవ్ స్మిత్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెర్సీ రంగు మారడం వల్లే భారత్ ఓటమి : మెహబూబా ముఫ్తీ