Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్‌పుల్ హీరోయిన్‌పై కన్నేసిన పవర్ స్టార్!

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (16:10 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు... పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ చిత్రం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. కరోనా వైరస్ భూతం కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడింది. ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారు. 
 
ఈ చిత్రం తర్వాత ఆయన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా కొన్నిరోజుల‌కు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఆగింది. కోవిడ్ 19 ప్రభావం తగ్గిన తర్వాత ఈ మూవీ షూటింగ్ యధావిధిగా ప్రారంభంకానుంది. 
 
అయితే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం వేట కొనసాగింది. తొలుత జాక్వెలైన్‌, కీర్తి సురేష్ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి పేరు తెరపైకి వచ్చింది. ఇపుడు టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి పేరు వినిపిస్తోంది. 
 
గ‌తంలో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "వేదం"లో అనుష్క న‌టించింది. ఆ ప‌రిచ‌యంతోనే క్రిష్ అడ‌గ‌టంతో మ‌రోసారి ఆయన సినిమాలో న‌టించ‌డానికి ఓకే అన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments