సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్ బుక్‌కు చెందిన వాట్సాప్ కొత్త ఫీచర్లతో అదరగొడుతోంది. తాజాగా లాక్ ఇన్ చేసే అప్‌డేట్‌ను అందించనుంది. వాట్సాప్ ఫేస్ బుక్ చేతికి చేరిన తర్వాత కొత్త కొత్త ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వాట్సాప్ వీడియో కాల్ స్టేటస్‌ను తగ్గించింది. ఇందులో భాగంగా వాట్సాప్ స్టేటస్ సమయాన్ని 30 సెకన్ల నుంచి 15 సెకన్లకు తగ్గించింది.
తాజాగా పలు ఫోన్ల నుంచి లాక్ ఇన్ చేసే అప్ డేట్‌ను వాట్సాప్ అమలు చేయనుంది. ఈ అప్ డేట్ ద్వారా వినియోగదారులు ఒకే అకౌంట్‌ను అనేక ఫోన్ల నుంచి లాక్ ఇన్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు అనే ఇతరత్రా సాధనాల నుంచి వాట్సాప్‌ను లాక్ ఇన్ చేసుకోవచ్చు. ఈ అప్ డేట్ ప్రస్తుతం పూర్తిగా అమల్లోకి రాలేదు. త్వరలోనే వాట్సాప్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.