Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2020లో వాట్సాప్‌లో రానున్న న్యూ ఫీచర్స్ ఏంటి?

2020లో వాట్సాప్‌లో రానున్న న్యూ ఫీచర్స్ ఏంటి?
, మంగళవారం, 7 జనవరి 2020 (13:56 IST)
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ దిగ్గజాల్లో ఒకటి వాట్సాప్. స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తమైన ఉండే ఈ వాట్సాప్‌లో 2020 సంవత్సరంలో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒకటి డార్క్ మోడ్. లో డేటా మోడ్, ఆటోమేటిక్ డిలీటెడ్ మెసేజ్. 
 
నిజానికి వీటితో పాటు.. పలు రకాలైన ఫీచర్లు పలు రకాలైన సోషల్ మీడియా యాప్స్‌లలో లభిస్తున్నాయి. కానీ, వాట్సాప్‌లో మాత్రం ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో కొత్త సంవత్సరంలో ఈ తరహా ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది. ఇలా అందుబాటులోకి తీసుకునిరానున్న ఫీచర్లలో డార్క్ మోడ్, లో డేటా మోడ్, మల్టిపుల్ డివైస్ సపోర్టు, ఆటోమేటిక్ మెసేజెస్ డిలీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 
 
డేటా మోడ్‌ ఫీచర్‌ వల్ల మొబైల్‌ డేటా వాడుతున్నప్పుడు డేటా సేవ్‌ అవుతుంది. అలాగే మల్టిపుల్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌ ద్వారా ఒక వాట్సాప్‌ అకౌంట్‌ను ఎన్ని డివైస్‌లలో అయినా వాడుకోవచ్చు. ఇక క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా కాంటాక్ట్‌ల షేరింగ్‌, వాట్సాప్‌ స్టేటస్‌ హైడింగ్‌ తదితర ఫీచర్లను కూడా వాట్సాప్‌ త్వరలోనే అందివ్వనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లను వాట్సాప్‌ టెస్ట్‌ చేస్తుండగా.. అతి త్వరలోనే కొత్త అప్‌డేట్‌ ద్వారా వాటిని వాట్సాప్‌ తన యూజర్లకు అందివ్వనుంది.
 
కాగా, విండోస్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయని విషయం తెల్సిందే. అలాగే, మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి వాట్సాప్‌ యాప్‌ను తొలగించనున్నట్లు కూడా వాట్సాప్‌ తెలిపింది. కాగా 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఐఓఎస్‌ 8 , ఆండ్రాయిడ్‌ 2.3.7 ఓఎస్‌లు, అంతకు ముందు వచ్చిన ఓఎస్‌లు ఉన్న ఫోన్లలోనూ వాట్సాప్‌ పనిచేయదని ఆ సంస్థ తెలిపింది.
 
మరోవైపు, కొత్త సంవత్సరం రోజున వాట్సాప్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. డిసెంబర్‌ 31వ తేదీన న్యూ ఇయర్‌ ఈవ్‌ సందర్భంగా ఆ యాప్‌లో ప్రపంచ వ్యాప్తంగా 100 బిలియన్ల మెసేజ్‌లను యూజర్లు పంపుకున్నారని వాట్సాప్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో వాట్సాప్‌లో యూజర్లు ఎప్పుడూ ఇలా మెసేజ్‌లను పంపుకోలేదని, ఇలా 100 బిలియన్ల మెసేజ్‌లను పంపుకోవడం ఇదే మొదటిసారని ఆ సంస్థ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జుట్టు రాలిపోయిందని యువకుడు ఆత్మహత్య...