Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#ఫేస్‌బుక్ పే వచ్చేసింది..

Advertiesment
#ఫేస్‌బుక్ పే వచ్చేసింది..
, గురువారం, 14 నవంబరు 2019 (11:25 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ తన యూజర్లకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. వీటిలో తాజాగా కొత్త పేమెంట్ సిస్టమ్‌ను లాంచ్ చేసింది. ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌‌స్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్‌ అన్నింటిలోనూ ఈ పేమెంట్ వ్యవస్థ పనిచేస్తున్న తరుణంలో ఫేస్‌బుక్ కూడా ఫేస్‌బుక్ పే పేరిట కొత్త సేవలను ప్రారంభించింది.

ఫేస్‌బుక్, మెసెంజర్ యాప్స్‌లో ఫేస్‌బుక్ పే సేవలు పొందాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్ పే పేమెంట్ మెథడ్‌ను యాడ్ చేసుకోవాలి. ఫేస్‌బుక్ పే సర్వీసులకు పిన్, బయోమెట్రిక్స్ (టచ్ లేదా ఫేస్ ఐడీ) వంటి వాటిని సెట్ చేసుకోవచ్చు.
 
ఈ ఫేస్‌బుక్ పే సర్వీసులు ఈ వారం నుంచి ఫేస్‌బుక్, మెసేంజర్ యాప్స్‌లలో అందుబాటులోకి రానున్నాయి. తొలిగా అమెరికాలో ఈ సర్వీసులు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఫండ్‌రైజర్స్, ఇన్‌గేమ్ పర్చేసెస్, ఈవెంట్ టికెట్స్, పర్సన్ టు పర్సన్ పేమెంట్స్ వంటి సేవలు పొందొచ్చు. ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో కొనుగోళ్లు కూడా నిర్వహించొచ్చు.
 
రానున్న కాలంలో ఫేస్‌బుక్ పే సర్వీసులను ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ డెబోరాహ్ లియు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యూజర్లకు కూడా ఈ సర్వీసులను అందిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫేస్‌బుక్ పే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పేపాల్ వంటి వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమల కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ