Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Whatsappలో కొత్త ప్రైవసీ ఫీచర్.. గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేయాలంటే?

Whatsappలో కొత్త ప్రైవసీ ఫీచర్.. గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేయాలంటే?
, శుక్రవారం, 8 నవంబరు 2019 (13:12 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్ నుంచి కొత్త ప్రైవసీ ఫీచర్ రావడంతో ఈ ఫీచర్ ద్వారా అవసరం లేని గ్రూప్స్‌లోకి బలవంతంగా మిమ్మల్ని యాడ్ చేసే తలనొప్పి తగ్గిపోతుంది. ఇన్నిరోజులు అనుమతి లేకుండా మిమ్మల్ని ఇతర గ్రూపుల్లోకి ఎవరు పడితే వాళ్లు యాడ్ చేసే అవకాశం వుంటుంది. కానీ తాజా ఫీచర్ ద్వారా ఈ తలనొప్పికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు.. వాట్సాప్ సంస్థ నిర్వాహకులు. 
 
ఫీచర్ సంగతికి వస్తే.. కొద్దిరోజుల క్రితమే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సప్... ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు రోల్ అవుట్ చేస్తోంది. తద్వారా గ్రూపులో ఇక మిమ్మల్ని అంత సులభం యాడ్ చేయలేరు.  అంటే మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. 
 
ఈ ఫీచర్ కోసం.. వాట్సప్‌లో గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌ని మార్చడానికి ముందుగా వాట్సప్ ఓపెన్ చేయాల్సి వుంటుంది. టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేశాక.. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేయాలని వాట్సాప్ తెలిపింది. అకౌంట్‌లో ప్రైవసీ క్లిక్ చేయండి. ప్రైవసీలో గ్రూప్స్ క్లిక్ చేయాలి. అందులో Everyone, My contacts, My contacts except, Nobody అని నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. 
 
వీటిలో Everyone సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా గ్రూప్స్‌లో యాడ్ చేయొచ్చు. My contacts సెలెక్ట్ చేస్తే కేవలం మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారే గ్రూప్స్‌లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది.  మీరు My contacts except సెలెక్ట్ చేస్తే ఎవరు మిమ్మల్ని గ్రూప్స్‌లో యాడ్ చేయొద్దో వారి కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాకుండా.. Nobody అని సెలెక్ట్ చేశారంటే మిమ్మల్ని ఎవరూ గ్రూప్స్‌లో యాడ్ చేయలేరు. 
 
ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని వాట్సాప్ భావిస్తోంది. గతంలో ఈ ఫీచర్ కేవలం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా టెస్టింగ్ తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్‌ను వాట్సాప్ సంస్థ రోల్ అవుట్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనాలిలో మంచు వర్షం..