స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడనేది ఎంత నిజమో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేని వారు కూడా వుండరు. ఈ వాట్సాప్‌కు రోజురోజుకు యూజర్ల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అటు వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్లు తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మరో సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. ఎంతో కాలంగా వాట్సాప్ వినియోగదారులు అందరూ ఎదురుచూస్తున్న ఫింగర్ ప్రింట్ అన్లాక్ వచ్చేసింది.
కొన్ని నెలలుగా బీటా సెట్టింగ్ చేసిన తర్వాత మొత్తానికి ప్రస్తుతం యూజర్లకు ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ రిలీజ్ చేసింది వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ యూజర్స్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ లాక్ ఇన్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్ చాట్స్‌కు బయోమెట్రిక్ సెక్యూరిటీ ఇప్పటినుంచి లభించనుంది. ఎన్నిరోజుల వరకు వాట్సాప్ లాక్ చేయాలంటే చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్‌ని ఉపయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం వాట్సాప్ ప్రత్యేకంగా ఫింగర్ ప్రింట్ లాక్ ఫ్యూచర్‌ని వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. ఇప్పటికే చాలా యాప్స్ తన వినియోగదారులను ఆకర్షించడానికి ఫింగర్ ప్రింట్స్ ఫీచర్‌ని తీసుకురాగా, ప్రస్తుతం వాట్సాప్ లోకి కూడా ఈ ఫీచర్ చేరింది.