Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరాలతో అనుష్క... ఎన్నారై మహిళగా

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (09:04 IST)
'బాహుబలి' చిత్రం తర్వాత అనుష్క శెట్టి ఎట్టకేలకు మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించింది. బాహుబలి తర్వాత ఆమె నటించనున్న చిత్రం ఇదే. గత యేడాది కాలంగా కెమెరా ముందుకురాని అనుష్క ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రానికి 'ఎ ఫ్లాట్', 'ముంబై 125కేఎం', 'వస్తాడు నా రాజు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు.
 
ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ వుమెన్‌‌గా అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. అంజలి, షాలినీ పాండే కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 'సైలెన్స్' అనే పేరు ఖరారు చేశారు. మార్చి నెల చివరకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కథ, తన పాత్ర నచ్చడంతోనే అనుష్క ఈ చిత్రం ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. 
 
సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క కొత్త లుక్‌లో కనిపించనున్నారని, అందుకోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments