Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కువైట్‌లో భర్త.. గ్రామంలో భార్య రాసలీలలు...

Advertiesment
కువైట్‌లో భర్త.. గ్రామంలో భార్య రాసలీలలు...
, ఆదివారం, 10 మార్చి 2019 (09:00 IST)
కడప జిల్లాలో అక్రమ సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. వివాహిత ఆత్మహత్య చేసుకోగా, ఆమె ప్రియుడు అనుమానాస్పదరీతిలో బైకుతో పాటు.. తాను కూడా సజీవదహనమయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప నగరం చిన్నచౌకు ఎస్టీ కాలనీకి చెందిన సౌదగిరి శ్రావణ్‌ (26) కడపలోని ఓ జిమ్‌ సెంటరులో బాడీబిల్డింగ్‌ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. చింతకొమ్మదిన్నె మండలంలోని పడిగెలపల్లెకు చెందిన సుంకర సరస్వతి (25) అనే మహిళకు పెళ్లికాగా, భర్త కువైట్‌లో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 
 
ఈ క్రమంలో శ్రావణ్‌, సరస్వతిలకు గతంలోనే పరిచయం ఉండేది. తరచూ మొబైల్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కానీ, ఆమె కోసం శ్రావణ్ పడిగెలపల్లెకు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. 
 
కానీ, శుక్రవారం మండల పరిధిలోని గంగమ్మ తిరుణాలకు వచ్చాడు. అక్కడి నుంచి సమీపంలోని సరస్వతి ఇంటికి వెళ్లగా అప్పటికే ఆమె ఇంటి దూలానికి ఉరి వేసుకుని కొనఊపిరితో ఉండటం గమనించిన శ్రావణ్‌ ఆమెను రక్షించే ప్రయత్నం చేశాడు. ఆసుపత్రికి తరలించేందుకు బయటికి తీసుకువచ్చి తన ద్విచక్రవాహనంలోకి ఎక్కించుకునేటప్పుడు గ్రామస్థులు చుట్టుముట్టడంతో శ్రావణ్‌ సరస్వతిని వదిలేసి భయపడి పారిపోయాడు. 
 
పడిగెలపల్లె నుంచి బైక్‌లో పరారైన శ్రావణ్‌ రిమ్స్‌ రోడ్డులోని వెంకటగారిపల్లె సమీపంలో తన బైక్‌తో సహా కాలిపోయి మృతి చెందాడు. శ్రావణ్‌ తనకు తానే పెట్రోలు పోసుకుని కాల్చుకున్నాడా, లేక ఎవరైనా అతనిని సజీవ దహనం చేశారా? అనే విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో రెండు మొ బైల్‌ ఫోన్‌లు దొరకడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగరంగ వైభవంగా ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతా వివాహ మహోత్సవం(Video)