Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్శ‌బ్దంలో అంజ‌లి లుక్ విడుద‌ల‌, ఆమె క్యారెక్ట‌ర్ ఏంటి?

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (15:55 IST)
అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అంజ‌లి. తాజాగా ఈమె `నిశ్శ‌బ్దం` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న క్రాస్ ఓవ‌ర్ చిత్రం `నిశ్శ‌బ్దం`. 
 
సాక్షి అనే అమ్మాయిగా అనుష్క వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అలాగే సినిమాలో మ‌రో ప్ర‌ధాన పాత్రధారి మాధ‌వ‌న్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. రీసెంట్‌గా సినిమా ప్రీ టీజ‌ర్ కూడా విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
 
 
హేమంత్ మ‌ధుక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్ పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో గ్రాండ్‌ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం గోపీ సుంద‌ర్ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments