Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆండ్రియా, అంజలిల తారామణి.. తెలుగులో సెప్టెంబర్ 6న విడుదల

Advertiesment
ఆండ్రియా, అంజలిల తారామణి.. తెలుగులో సెప్టెంబర్ 6న విడుదల
, బుధవారం, 21 ఆగస్టు 2019 (11:18 IST)
తమిళ డబ్బింగ్ చిత్రాలు ఇటీవల తెలుగులో ఆశించిన ఫలితాల్ని కనబర్చడం లేదు. అనువాదాల కంటే స్ట్రెయిట్ సినిమాలకే మన జనం ఆదరణ ఇస్తున్నారు. మన కథాంశాల్లో మ్యాటర్ పెరిగిందనడానికి ఇదో నిదర్శనం. నేటివిటీ సినిమాల్లో తంబీలదే పైచేయి అని మునుపటి వరకు భావించిన వారు ఇప్పుడు వారి అభిప్రాయం మార్చుకోవాల్సి ఉంటుంది. 
 
అయితే తమిళంలో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన `తారామణి` చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన నాయిక. అంజలి ఓ కీలక పాత్రను పోషించింది. రామ్ దర్శకత్వంలో జె.ఎస్.కె ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి.సినీ క్రియేషన్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ సంస్థలు తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 
 
సెప్టెంబర్ 6న రిలీజ్ అంటూ ప్రకటించారు. ఇదో ముక్కోణ ప్రేమకథా చిత్రం. ఎమోషనల్ కంటెంట్‌తో పాటు అన్ని విశేషాంశాలు సమపాళ్లలో ఉంటాయని ప్రస్తుతం సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా సాగుతుందని నిర్మాతలు చెబుతున్నారు. యూత్ టెక్నాలజీ మాయలో పడి ఎలా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు. దాని పర్యవసానం ఏమిటి అన్న దాని గురించి చూపిస్తున్నారట. 
 
కథాంశం పరంగా చూస్తే ఇదేమీ కొత్త ట్రెండ్ కాదు కానీ ఆండ్రియా, అంజలి పెర్ఫామెన్స్‌లు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే వచ్చి ఉండాలి. కానీ వస్తోంది అంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. 
 
కానీ ఇప్పటికి గానీ రిలీజ్ చేయలేకపోతున్నారు ఎందుకో తెలియదు. సాహో లాంటి భారీ చిత్రం రిలీజైన తర్వాత బరిలోకి దింపుతున్నారు. మరి ఈ సినిమా ఎంత మాత్రం విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుధీర్ - రష్మికి మించి రొమాన్స్ చేస్తున్న బుల్లితెర కొత్త జోడీ (Video)