Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుధీర్ - రష్మికి మించి రొమాన్స్ చేస్తున్న బుల్లితెర కొత్త జోడీ (Video)

Advertiesment
Television
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:22 IST)
బుల్లితెరపై వచ్చే ప్రోగ్రామ్‌లలో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నవాటిలో 'పటాస్' ఒకటి. జబర్ధస్త్‌కు ధీటుగా టీఆర్పీలను సాధించిన ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.


ఈ షో ఇంత మంచి హిట్ అవ్వడానికి కంటెంట్‌తో పాటు యాంకర్లు రవి, శ్రీముఖి కూడా ముఖ్య కారణం. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ వలన ఈ ప్రోగ్రామ్‌కు మరింత క్రేజ్‌తో పాటు అనేక వివాదాలు ముంచుకొచ్చాయి. కొంతకాలంగా శ్రీముఖి స్థానంలో వర్షిణి వస్తుండటంతో షో చప్పగా సాగుతుందని జనాలు అనుకుంటున్నారు.
 
బిగ్ బాస్ రియాలిటీ షో కోసం శ్రీముఖి పటాస్ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో మరో యాంకర్ వర్షిణి దర్శనమిచ్చింది. శ్రీముఖి రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినప్పటికీ పర్వాలేదనిపిస్తోంది. అయితే, అకస్మాత్తుగా ఈ షోలో ఒక మార్పు చోటుచేసుకుంది. శ్రీముఖి లేకపోవడం, కమెడియన్లు కూడా కొత్త వారు కావడంతో ఈ షో పట్ల జనాల్లో ఆసక్తి తగ్గిపోతోందన్న టాక్ వినిపిస్తోంది. 
 
ఈ తరుణంలో తమలోని కొత్త కోణాన్ని బయటపెట్టారు రవి, వర్షిణిలు. తాజాగా విడుదలైన పటాస్ ప్రోమోలో ‘తెల్లా తెల్లాని చీర..' అనే పాటకు మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు ఈ జోడీ. ఈ పాటలో వీరి రొమాన్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల రష్మీ - సుధీర్ ఢీ షోలో చేసిన రొమాంటిక్ డ్యాన్స్‌కు మించిపోయేలా ఈ ప్రదర్శన ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#SyeRaaNarasimhaReddy ఫస్ట్ టీజర్ వచ్చేసింది..(Video)