తన రేటు ఎంతో చెప్పిన రష్మిగౌతమ్.. ఎవరికి.. ఎందుకు..? (video)

సోమవారం, 19 ఆగస్టు 2019 (16:31 IST)
బుల్లితెర హాట్ యాంకర్ రష్మి గౌతమ్. ఓ ఫైర్ బ్రాండ్. సోషియల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. ఎవరైనా ట్రోల్ చేస్తే వారిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తోంది. లేటెస్ట్‌గా కొందరు బూతుల ప్రపోజల్స్ పెట్టారు. వారికి ఆమె చేసిన మర్యాద మామూలుగా లేదు.
 
నైట్‌కి ఎంతిస్తే వస్తావు. రష్మికి ఇలాంటి పిచ్చి మాటలతో ట్రోలింగ్. ప్రైవేట్ టాక్‌ని పబ్లిక్‌లో పెట్టిన రష్మి. రష్మి గౌతమ్. తెలుగు బుల్లితెరలో ఒక చిన్నసైజు ఫైర్ బ్రాండ్. మనస్సులో ఏది అనిపిస్తే అదే బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టెలివిజన్ కామెడీ, రియాలిటీ షోలతో బాగా బిజీగా ఉండే ఈ అమ్మడు అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ తెగ అల్లరి చేస్తోన్న విషయం తెలిసిందే.
 
రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి నిక్కర్ వివాదంపై రష్మి స్పందించింది. రంగులు జంతువులకు కాదు మనుషులకు పూయండి అంటూ కాంట్రవర్సీ చేసేసింది. ఇవన్నీ బుల్లితెర భామకు బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఏమైనా ఇష్యూ ఉంటే స్పందిస్తే సరే. ఇప్పుడు నా మనస్సునే గాయపరిచారంటూ బాధపడుతోంది రష్మి.
 
తన అభిమానులు కొంతమంది రాత్రికి వస్తావా అంటూ వందల మెసేజ్‌లు పంపించారట. వస్తే రాత్రికి ఎంత తీసుకుంటావు అందట. దీంతో రష్మికి కోపం కట్టలు తెంచుకుంది. మీలాంటి పిచ్చికుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మెసేజ్ చెప్పిందట.

పదిమందిలో మాట్లాడితే పరువు పోతుందన్న భయంతోనే చాలామంది మాట్లాడలేకపోతున్నారని, కానీ నేను మాత్రం అలాంటి దానిని కాదంటోంది రష్మి గౌతమ్. నా రేటు గురించి మాట్లాడితే ఇక నేను తిట్టే బూతులు మీరు వినలేరు అంటూ ట్వీట్ చేసిందట. రష్మి ట్వీట్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కృష్ణంరాజు ఎందుకలా అన్నారు.. ప్రభాస్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారంటే..?