Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆగస్టు 23న కపిలితీర్ధంలో గోకులాష్టమి వేడుకలు

Advertiesment
ఆగస్టు 23న కపిలితీర్ధంలో  గోకులాష్టమి వేడుకలు
, సోమవారం, 19 ఆగస్టు 2019 (16:23 IST)
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీ గోకులాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. 
 
ఇందులో భాగంగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, రాత్రి 8.00 నుండి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.
 
సెప్టెంబరు 2వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి 
 
శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 2వ తేదీ వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 
 
ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆగ‌స్టు 23న తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి
 
కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఆగ‌స్టు 23న శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగ‌స్టు 24న ఉట్లోత్సవం జ‌రుగ‌నున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆగ‌స్టు 23వ తేదీన‌ రాత్రి 7.30 గంటల నుండి 9.30 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రభంద శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేప‌డ‌తారు.
 
కాగా ఆగ‌స్టు 24న తిరుమలలో ఉట్లోత్సవాన్ని సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.
 
ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగ‌స్టు 24వ తేదిన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ వేడుకల్లో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణ భగవాన్ స్వయం- కృష్ణావతారం భగవత్ స్వరూపమే...