నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (09:43 IST)
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నవంబరు మాసానికి సంబంధించి శుక్రవారం తితిదే విడుదల చేయనుంది. టికెట్లను ‌www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తెస్తుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను బుక్‌ చేసుకున్న భక్తులను ఎలక్ట్రానిక్‌ లాటరీ (డిప్‌) విధానంలో ఎంపిక చేసి కేటాయించనుంది. 
 
విశేష పూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను మాత్రం కరెంటు బుకింగ్‌ కింద వెంటనే నమోదు చేసుకోవచ్చు. సేవా టికెట్లన్నీ కలిపి దాదాపు 60 వేలకుపైగా విడుదల చేయనుంది. జులైలో శ్రీవారికి రూ.106.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని, ఇటీవలి కాలంలో ఇది రికార్డు అని తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #DailyHoroscope 02-08-2019- శుక్రవారం మీ రాశి ఫలితాలు..