Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పుడు వార్తను ప్రచురించిన ఆ టీవీ చానెల్‌పై కేసు : వైవీ సుబ్బారెడ్డి

Advertiesment
తప్పుడు వార్తను ప్రచురించిన ఆ టీవీ చానెల్‌పై కేసు : వైవీ సుబ్బారెడ్డి
, గురువారం, 25 జులై 2019 (15:58 IST)
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తోందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ డేవిడ్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను టీవీ-5 ఛానెల్‌ తన వెబ్‌సైట్లో పెట్టిందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తను ప్రచురించిన వెబ్‌సైట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
కేసు కూడా పెట్టనున్నట్టు తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిందని ఆరోపించారు. వైయస్‌.జగన్‌ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారు. దేవుడు ముందు అందరూ సమానులే అని మేం నిరూపిస్తుంటే, ఆ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, వైయస్‌.జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ చేతిలో ఎల్లోమీడియాను వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారనీ, ఇలా విష ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ క్యాంపాఫీసు వద్ద వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం