Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరానికి మరో రూ.6,764 కోట్లిచ్చాం.. ఏం చేశారు? : నిర్మాల సీతారామన్

పోలవరానికి మరో రూ.6,764 కోట్లిచ్చాం.. ఏం చేశారు? : నిర్మాల సీతారామన్
, బుధవారం, 3 జులై 2019 (15:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక లోటును తీర్చేందుకు రూ.3,979 కోట్లు అందించినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 
 
ఆంధ్రుల రాజధాని అమరావతికి ఇప్పటివరకూ రూ.2,500 కోట్ల ఆర్థిక సాయం చేశామన్నారు. అలాగే ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు కోసం రూ.6,764 కోట్లను ఇప్పటివరకూ విడుదల చేశామన్నారు. ఏపీ ఆర్థికలోటుతో సతమతం అవుతున్న నేపథ్యంలో రూ.3,979 కోట్ల ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. 
 
అలాగే మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ తాత్కాలిక క్యాంపస్‌లో 2018-19 బ్యాచ్‌లో 50 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదువుకుంటున్నట్లు సీతారామన్ తెలిపారు. 
 
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలును ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు ఇంకా అందలేదని స్పష్టం చేశారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు సీతారామన్ ఈ మేరకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోరుమన్న కుప్పం ... ఓడిపోయినా ప్రజలతోనే ఉంటానన్న బాబు