Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్‌లో ‘స్వరాంజలి’... శ్రవణానందకరంగా సంగీతోత్సవం

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్‌లో ‘స్వరాంజలి’... శ్రవణానందకరంగా సంగీతోత్సవం
, శనివారం, 20 జులై 2019 (16:35 IST)
సికింద్రాబాద్: గౌరవనీయులు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుగారి సారధ్యంలో నిర్వహించబడుతున్న విద్యానంద విద్యాసంస్థలలో ఒకటైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)- సికింద్రాబాదులో శనివారం "స్వరాంజలి" శీర్షికన డి.పి. ఎస్ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు గానం చేసిన గీతాలు హృదయోల్లాసాన్ని కలిగించాయి.
 
కళారత్న శ్రీ డి.వి. మోహానకృష్ణగారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల గాత్ర మాధుర్యానికి మంత్రముగ్ధులై, విద్యార్థులను, వారిని ప్రోత్సాహిస్తున్న డి.పి.ఎస్. పాఠశాలలను, తల్లిదండ్రులను అభినందించారు.
 
ఈ కార్యక్రామానికి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ గాయకులు శ్రీమతి జి.శ్వేతగారు, శ్రీ నాడగౌడ సుధీర్ కుమార్ గారు, శ్రీమతి నీతా చంద్రశేఖర్ గారు వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగీతం ఓ ఝురి ప్రవాహమని, మానసికోల్లాసానికి ఉపకరించే మహత్తర ప్రక్రియ అని పేర్కొన్నారు.
webdunia
 
ఆ సంగీత ఝురిలో ఓలలాడించిన విద్యార్థులందరిని ప్రశంసించారు. పోటీలో పాల్గొన్న ప్రతీ విద్యార్థి విజేతేనని, వారిలోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. అనంతరం నయనానందకరంగా బహుమతి ప్రదానం జరిగింది.
 
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి శైలజా గోపినాథ్ గారు మాట్లాడుతూ, "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి:" అంటూ, సృష్టిలోని ప్రతీ జీవిని పరవసింపజేసే అద్వితీయమైన ప్రక్రియే సంగీతమని అన్నారు. విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాలలో నిష్ణాతులను చేస్తున్న తల్లిదండ్రుల, గురువుల కృషిని ప్రశంసించారు. డి.పి.ఎస్ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు అన్ని సాంస్కృతిక రంగాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని అది హర్షణీయమని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏమయ్యా... బుర్రాబుద్ధీ వుందా... పులిరాజా సాంబార్ అన్నం తిని చచ్చిందా?