Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ నో చెప్పిన హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఇవే

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (20:45 IST)
కథలు నచ్చకపోవడం వలనో డేట్లు కుదరకపోవడం వలనో కొన్ని సినిమాలకు బన్నీ నో చెప్పాడు. అలా.. కొన్ని కారణాల వలన బన్నీ వదులుకున్న సినిమాల జాబితాలో కొన్నొ హిట్ సినిమాలు కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ముందుగా హిట్ సినిమాల గురించి చెప్పాలంటే... తేజ, నితిన్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా జయం. ఈ సినిమా యూత్‌కి బాగా నచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో జయం సినిమాకి విజయం వచ్చింది. ప్రేమకథా చిత్రాల్లో మరచిపోలేని సినిమాగా నిలిచింది. 
 
ఈ మూవీ స్టోరీని ముందుగా తేజ బన్నీకే చెప్పారట. అయితే... అప్పుడు బన్నీ బిజీగా ఉండటం వలన ఈ సినిమా చేయడానికి నో చెప్పారు. ఆ తర్వాత నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ ఈ సినిమాని అందించారు.
 
 బన్నీ నో చెప్పిన మరో సినిమా భద్ర. బోయపాటి శ్రీను ఫస్ట్ ఈ సినిమా కథని అల్లు అర్జున్‌కే చెప్పారు. కథ నచ్చింది కానీ.. తనకి సెట్ కాదనుకున్నాడో.. అప్పుడు బిజీగా ఉన్నాడో తెలియదు కానీ ఈ సినిమా చేయలేదు. 
 
కాకపోతే ఈ కథ తనకు బాగా నచ్చడంతో బోయపాటి శ్రీనును నిర్మాత దిల్ రాజు దగ్గరకి తీసుకువెళ్లి ఈ ప్రాజెక్ట్ ఓకే చేయించారు. దిల్ రాజుకు బోయపాటి చెప్పిన కథ బాగా నచ్చడంతో రవితేజకు ఈ కథను చెప్పించడం, ఆ తర్వాత అదే భద్ర సినిమాగా రావడం విజయం సాధించడం తెలిసిందే. 
 
బన్నీ నో చెప్పిన మరో సినిమా 100% లవ్. ఈ చిత్రంలో నాగ చైతన్య, తమన్నా జంటగా నటించారు. దీనికి సుకుమార్ దర్శకత్వం వహించారు.
 
ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ నిర్మించారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా నాగచైతన్యకు మంచి విజయాన్ని అందించింది. అయితే.. ఈ సినిమా కథను ముందుగా అల్లు అర్జున్‌కే చెప్పాడు డైరెక్టర్ సుకుమార్. వీటితో పాటు బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా కథ కూడా ముందుగా బన్నీ దగ్గరకి వెళ్లింది. 
 
అయితే.. బన్నీకి ఈ కథ నచ్చలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఈ సినిమాని తెరకెక్కించడం ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలవడం జరిగింది. వీటితో పాటు పండగ చేస్కో, గీత గోవిందం సినిమాల కథలు కూడా ముందుగా బన్నీ దగ్గరకే వచ్చాయి. ఇక బన్నీ నో చెప్పగా ఫ్లాప్ అయిన సినిమాల విషయానికి వస్తే... విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్, చైతూ ఒక లైలా కోసం, రవితేజ డిస్కోరాజా కథలు కూడా ముందుగా బన్నీ దగ్గరికే వచ్చాయి. ఆయన ఈ సినిమాలకు నో చెప్పగా అవి ప్లాప్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments