మా 'మల్లు' అర్జున్ గ్రేట్, బన్నీని పొగడ్తలతో ముంచేసిన కేరళ సీఎం

గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:56 IST)
అల్లు అర్జున్, అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు కేరళ సినీ ఇండస్ట్రీలోనూ సూపర్ క్రేజ్ వుంది. ప్రస్తుతం కేరళ రాష్ట్రం కరోనా వైరస్ సమస్యతో అల్లాడుతోంది. ఇందుకుగాను తమ రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు చేయూతనిచ్చిన అల్లు అర్జున్‌ని ప్రత్యేకంగా అభినందించారు కేరళ సీఎం విజయన్.
 
కరోనా వైరస్‌ను ఎదుర్కొంటూ లాక్ డౌన్ ప్రకటించి సమస్యలతో సతమవుతున్న తమకు బన్నీ తెలుగు రాష్ట్రాలతో సమానంగా చేయూతనిచ్చారని అన్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 25,00,000 ఇచ్చిన బన్నీకి కేరళ ప్రజలు రుణపడివుంటారని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు.
 
బన్నీకి కేరళలో మంచి క్రేజ్ వుందనీ, ఇక్కడి ఆడియెన్స్ బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. అందుకే ఇప్పుడు బన్నీ కేరళ హీరోల్లో తనూ ఒకరయ్యారు..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏపీలో 'కోవిడ్ వారియర్స్'... 2 వేల మంది వైద్య విద్యార్థులు చేరిక