ఆ పోస్టరుతో బర్త్ డే విషెస్ చెప్పినందుకు అల్లు అర్జున్ ఆగ్రహం, ఏమైంది?

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:55 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో  అల.. వైకుంఠపురములో, సుకుమార్‌తో ఓ మూవీ, ఎంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌తో ఐకాన్ మూవీని ఎనౌన్స్ చేసాడు. అల.. వైకుంఠపురములో సినిమా సెట్స్ పైన ఉండగానే, మరో సినిమా స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. అప్పుడు అందరిలో ఒకటే డౌటు. అల.. వైకుంఠపురములో తర్వాత బన్నీ సుకుమార్‌తో సినిమా చేస్తాడా..? లేక వేణు శ్రీరామ్‌తో సినిమా చేస్తాడా...? అని. 
 
ఈ అనుమానం అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా చాలామంది వ్యక్తం చేసారు. ఆఖరికి సుకుమార్‌తో చేయనున్న సినిమానే ముందుగా స్టార్ట్ చేసాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ఖరారు చేసారు.
 
సుకుమార్ మూవీ త‌ర్వాత వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు. అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. అయితే వేణు శ్రీరామ్, పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పింక్ రీమేక్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో ఒకటే డౌట్. బ‌న్నీతో వేణు శ్రీరామ్ ఐకాన్ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అని. 
 
అయితే...బ‌న్నీ స‌న్నిహితుడు బ‌న్నీవాస్ ఓ సందర్భంలో స్పందిస్తూ, ఐకాన్ స్టోరీ బ‌న్నీకి చాలా బాగా న‌చ్చింది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అనే వార్త‌ల్లో ఎంతమాత్రం నిజం లేదు. త‌ప్ప‌కుండా ఐకాన్ మూవీ ఉంటుంది. ఈ క‌థ‌ను వేరే హీరోకి ఎవ‌రికీ చెప్ప‌ద్దు. ఖ‌చ్చితంగా మ‌నం క‌లిసి ఈ సినిమా చేద్దాం అని బ‌న్నీ, వేణు శ్రీరామ్‌కి చెప్పార‌ని బ‌న్నీ వాస్ బ‌య‌ట‌పెట్టాడు. అయినప్పటికీ... ఐకాన్ మూవీ లేనట్టే అంటూ టాలీవుడ్లో టాక్ వినిపించింది. దీంతో ఐకాన్ మూవీ ఉందా..? లేదా..? అనేది సస్పెన్స్‌గా మారింది.
 
అయితే.. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ టీమ్ బర్త్ డే విషెస్ తెలియచేసింది. ఈ పోస్టర్‌తో బర్త్ డే విషెస్ చెప్పడం గురించి బన్నీ ఫీలయ్యారని.. ఇప్పుడు మళ్లీ ఐకాన్ పోస్టర్‌తో ఎందుకు చెప్పారు. ఐకాన్ పోస్టర్ లేకుండా చెప్పచ్చు కదా అని దిల్ రాజుతో అన్నారని... దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది మళ్లీ సస్పెన్స్‌గా మారిందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అదీ మేటరు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా కల్లోలంలోనూ రష్మిక మందన్న అంటే నాకు క్రష్ అంటూ ట్వీట్ చేసిన హీరో