Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న‌గారు ఉండుంటే చాలా గ‌ర్వ‌ప‌డేవారు... అల్లరి నరేష్ ఎమోష‌న‌ల్

Webdunia
సోమవారం, 13 మే 2019 (14:20 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించారు. ఇటీవ‌ల రిలీజైన మ‌హ‌ర్షి సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్స‌స్ మీట్లో అల్ల‌రి న‌రేష్ త‌న స్పంద‌న‌ను తెలియ‌చేస్తూ... ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యాడు. 
 
ఇంత‌కీ అల్ల‌రి న‌రేష్ అలా ఎందుకు ఫీల‌య్యాడంటే...“మా పాప పుట్టిన రెండో వారం నాకు వంశీ గారి నుండి ఫోన్ వచ్చింది. ఇలా మ‌హేష్ గారి సినిమా గురించి మాట్లాడాల‌ని న‌న్ను పిలిచారు. ముందు మ‌హేష్ గారి సినిమాలో నేనేంటి? అనిపించింది. స‌రే! మంచి కామెడీ క్యారెక్ట‌ర్ అయ్యుంటుందేమో! అని వెళ్లాను. ఆయ‌న 20 నిమిషాలు నెరేష‌న్ ఇచ్చారు. అంతా పూర్త‌యిన త‌ర్వాత ఈ క్యారెక్ట‌ర్‌లో న‌న్ను ఎలా ఊహించుకుంటున్నారు అని వంశీని అడిగాను. 
 
ఈ విష‌యం మ‌హేష్ గారికి తెలుసా? అని అన‌గానే, ఆయ‌నే ముందు మిమ్మ‌ల్ని అడ‌గ‌మ‌న్నారు అన‌గానే, చాలా హ్యాపీగా అనిపించింది. సాధార‌ణంగా నేను కామెడీ చేస్తాను. అలాంటిది ఓ సీరియ‌స్ క్యారెక్ట‌ర్ కూడా చేస్తాన‌ని న‌మ్మి ఇచ్చినందుకు మ‌హేష్ గారికి, వంశీ గారికి థాంక్స్‌. వైజ‌యంతీ మూవీస్ అంటే చాలా పెద్ద సంస్థ‌.. ప్ర‌తి ఒక యాక్ట‌ర్‌, టెక్నీషియ‌న్ ఆ సంస్థ‌లో చేయాల‌నుకుంటారు. మే 9న జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి, మ‌హాన‌టి సినిమాలు విడుద‌లయ్యాయి. ఇప్పుడు మ‌హ‌ర్షి విడుద‌లైంది. 
 
ఇక ద‌త్తు గారు మే 9కి ఓ సినిమా రెడీ చేసుకోవాలేమో. దిల్ రాజు గారు, వైజ‌యంతీ మూవీస్‌, పివిపి వంటి మూడు టాప్ బ్యానర్స్ చేస్తున్న సినిమాలో చేశాను. ప్ర‌తి ఒక్క‌రూ వారి క్యారెక్ట‌ర్‌ను నెక్ట్స్ రేంజ్‌లో చేశారు. మ‌హేష్ గారితో ప‌ని చేయడం గొప్ప అనుభవం. సీన్‌ను బ‌ట్టి మూడ్ క్యారీ చేసేవారు. చిన్న రియాక్ష‌న్‌ను కూడా ప‌ర్‌ఫెక్ట్‌గా చేయాల‌నుకుంటారు. ప‌ర్‌ఫెక్ష‌న్‌కి ఆయ‌నే నిద‌ర్శ‌నం అనిపించింది. మా నాన్న‌గారు ఉండుంటే చాలా గ‌ర్వ‌ప‌డేవారు. ఎందుకంటే ఆయ‌న డైరెక్ట‌ర్‌గా గ‌ర్వ‌ప‌డేవారు. డైరెక్ట‌ర్ కంటే ముందు ఆయ‌న ఒక రైతు. రైతుగా కూడా గ‌ర్వ‌ప‌డేవారు. చాలా సినిమాలు చేస్తాం. పేరొస్త‌ది.. కానీ రెస్పెక్ట్ మాత్రం కొన్ని సినిమాల‌కే వ‌స్త‌ది. మ‌హ‌ర్షి నాకు ఆ రెస్పెక్ట్‌నిచ్చింది అంటూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు అల్ల‌రి న‌రేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments