Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాని వెబ్ ఫిలింలో యముడిగా అజయ్ ఘోష్

డీవీ
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:35 IST)
Ajay Ghosh, yamudu
రాంబాబు దోమకొండ దర్శకత్వంలో "అభిమాని "అనే వెబ్ ఫిలిం రూపొందుతోంది. 2024 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో  చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు . ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ట్యాగ్‍లైన్. ఈ పోస్టర్లో యమధర్మరాజుకు సురేష్ కొండేటి మోకాళ్లపై నిల్చుని ఏదో వేడుకుంటున్నట్లు ఉంది. అభిమాని పోస్టర్ చూస్తుంటే.. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రానుందని అర్థమవుతోంది. 
 
ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‍కే రహ్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను బషీరమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యముడిగా నటించిన అజయ్ ఘోష్ తాజాగా ప్రసాద్ ల్యాబ్ లో తన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు.
 
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ "యముడు పాత్ర అనగానే తెలుగు వారికి  కైకాల సత్యనారాయణ గారు గుర్తుకు వస్తారు. అలాంటి మహానుభావులు పోషించిన పాత్ర నాకు దొరకడం నా అదృష్టం. ఈ పాత్రలో నా నటన మీ అందరినీ కట్టిపడేస్తుంది. నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కి థాంక్స్. సురేష్ కొండేటి హీరోగా నేను యముడిగా చేయడం చాలా బాగుంది. ఖచ్చితంగా అందరినీ అలరించే సబ్జెక్ట్ ఇది అన్నారు.
 
దర్శకుడు రాంబాబు దోమకొండ మాట్లాడుతూ సినిమా షూటింగ్  పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతన్నాయి, త్వరలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అన్నారు .  అనుకున్నదానికంటే అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మరొక ముఖ్య పాత్ర లో అన్నపూర్ణమ్మ గారి సహకారం మరువలేనిది అన్నారు. ఇంకా ఈ సినిమా లో జై క్రిష్, అక్సాఖాన్, దర్శన్, రెహ్మాన్ ఇతర సీనియర్ నటీనటులు నటించిన ఈ చిత్రానికి కొరియోగ్రఫీ : శ్రీధన్, ఫోటోగ్రఫీ : శేషు డి  నాయుడు,మాటలు : చరణ్, ఎడిటింగ్ : ఇంద్ర కర్నాటి అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments