Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువత రాజకీయాల్లోకి రావాలనే అంశంతో కంచర్ల రాబోతుంది

Kancharla Upendra - Meenakshi

డీవీ

, శనివారం, 20 జనవరి 2024 (17:32 IST)
Kancharla Upendra - Meenakshi
సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి  స్ఫూర్తినిచ్చే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఆ కోవకు చెందిన కధాంశంతో "కంచర్ల" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత కంచర్ల అచ్యుత రావు తెలియజేస్తున్నారు.  ఎస్.ఎస్.ఎల్.ఎస్ (S S L S) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబు అవుతోంది.
 
ఈ విషయాన్ని నిర్మాత కంచర్ల అచ్యుత రావు తెలియజేస్తూ, "ప్రస్తుతం పాటల చిత్రీకరణను కేరళ, గోవా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో జరుపుతున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుతున్నాం.  యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమర్షియల్ అంశాలను మేళవించి, ప్రేక్షకులను అలరింపజేసేలా చిత్రాన్ని మలచడం జరుగుతోంది" అని చెప్పారు.
 
హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, "ఇటీవల;నేను నటించిన ఉపేంద్ర గాడి అడ్డా" చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. దాని ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నేను ఈ చిత్రం ద్వారా మరింత దగ్గరవుతాను అని నమ్మకంగా చెప్పగలను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా నాన్నతీస్తున్న ఇంకో చక్కటి చిత్రమిది" అని అన్నారు.
 
దర్శకుడు రెడ్డెం యాద కుమార్ మాట్లాడుతూ, సామాజిక సృహతో సమాజాన్ని జాగృతం చేసే అంశాలను ఇందులో పొందుపరిచామని అన్నారు.
 
ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో సుమన్, అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్, సుధ, రాజా రవీంద్ర, సుమన్ శెట్టి, దువ్వాసి మోహన్, జబర్దస్త్ దొరబాబు, ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: కుంచె రఘు, సినిమా టోగ్రఫీ:: గుణశేఖర్, ఆర్ట్:: ఉత్తర కుమార్, కొరియోగ్రఫీ: లుక్స్ రాజశేఖర్, బాలకృష్ణ, బాలు, స్టo ట్స్: డ్రాగన్ ప్రకాష్, కృష్ణ, దేవరాజ్, ఎడిటింగ్: ఎస్.ఎఫ్.ఎక్స్ స్టూడియో శ్యామ్, మాటలు: ప్రసాదుల మధుబాబు, సహ నిర్మాతలు: కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత. నిర్మాత: కంచర్ల అచ్యుత రావు, దర్శకత్వం: రెడ్డెం యాద కుమార్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల సినిమాలో కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్