Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవరాజు తనయుడు ప్రణం దేవరాజ్ ప్రధాన పాత్రలో చిత్రం ప్రారంభం

Pranam, Devaraj, Ravi Sivateja, Tanikella Bharani- Shankar, P. Harikrishna Goud
, బుధవారం, 3 జనవరి 2024 (15:27 IST)
Pranam, Devaraj, Ravi Sivateja, Tanikella Bharani- Shankar, P. Harikrishna Goud
సీనియర్ నటుడు దేవరాజు తనయుడు ప్రణం దేవరాజ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో  పి.హరికృష్ణ గౌడ్ నిర్మాణంలో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ తొలిసినిమాగా తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అన్నపూర్ణ స్టూడియో లో ఈరోజు ఘనంగా ప్రారంభమైయింది.
 
ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, బాల సరస్వతి డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీ వర్కాల ఎడిటర్ కాగా, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్.
 
అనంతరం చిత్ర దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వుండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.  మొదటి షెడ్యుల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, తర్వాత వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతుంది'' అన్నారు
 
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం అంటే చాలా ప్యాషన్ వుండాలి. అలాంటి ప్యాషన్ తో నిర్మాత హరి గౌడ్, హరి క్రియేషన్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా వుంది. దేవరాజు గారు పాన్ ఇండియా నటుడు. ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని వాళ్ళ అబ్బాయి ప్రణం దేవరాజ్ పుణికిపుచ్చుకుని ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా వుంది. ఇది తనకి మూడో చిత్రం. ఇప్పటికే కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నారు. శంకర్ చాలా ప్రతిభ వున్న దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి' అని కోరారు
 
హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ వున్న కథ. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ వుంది. మీ అందరి ప్రోత్సాహం కావాలి'' అని కోరారు.
 
దేవరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడు శంకర్ చాలా అద్భుతమైన కథని రాసుకున్నారు. కథ చాలా బావుంది. హరి గౌడ్ మంచి అభిరుచి వున్న నిర్మాత. చాలా మంచి టీం కలసి చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. మీ అందరి ఆశీస్సులు వుండాలి'' అని కోరారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ఇది మా మొదటి ప్రొడక్షన్. మమ్మల్ని ఆశీర్వదించిన తనికెళ్ళ భరణి గారు, నరసింహారెడ్డి గారు, ఆకాష్ పూరిగారు, దేవరాజ్ గారికి కృతజ్ఞతలు, అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు.
టెక్నికల్ టీం:రచన, దర్శకత్వం: శంకర్, నిర్మాత: పి.హరికృష్ణ గౌడ్,మ్యూజిక్ : శేఖర్ చంద్ర, కొరియోగ్రాఫర్: జిత్తు మాస్టర్, ఫైట్స్: నటరాజన్, పీఆర్వో: తేజస్వి సజ్జ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు కారంలో సూపర్ స్టార్ కృష్ణ