Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీహరిలా శివ కంఠమనేని మంచి స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నా : సి.కళ్యాణ్

Siva Kanthmaneni, C. Kalyan, sanjev megoti and others
, బుధవారం, 3 జనవరి 2024 (14:05 IST)
Siva Kanthmaneni, C. Kalyan, sanjev megoti and others
శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో  KS శంకర్ రావ్, G.రాంబాబు యాదవ్, R.వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జనవరి 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో శివ కంఠమనేని మాట్లాడుతూ, ఇది మేం చేసిన మూడో సినిమా. మధురపూడి గ్రామం అనే నేను సినిమా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. అది మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. జనవరి 5న రిలీజ్ అవుతున్న మా రాఘవ రెడ్డి సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు.
 
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘శివ కంఠమనేని సినిమా సినిమాకు పరిధిని పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చక్కటి కమర్షియల్ మూవీని చేశారు. రాఘవరెడ్డి  సినిమా సాంగ్స్ బావున్నాయి. డైరెక్టర్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. శ్రీహరి ఎలా మంచి స్టార్‌గా ఎదిగారో శివ కంఠమనేని అలాగే ఎదగాలని కోరుకుంటున్నాను. జనవరి 5న రిలీజ్ అవుతోన్న ఈ మూవీకి థియేటర్స్ దొరికాయి. ఈ సినిమాను కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘శివ కంఠమనేని చక్కటి ప్లానింగ్‌తో ముందు నుంచి సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి మంచి కథతో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రాఘవ రెడ్డి చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్, ఫ్యాక్షన్, లవ్ స్టోరి, ఎమోషన్స్, ఫ్యామిలీ స్టోరి ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను చక్కగా మిక్స్ చేసి ప్రేక్షకులకు ఏది కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా ప్లాన్ చేశారు. జనవరి 5 చాలా చక్కటి రిలీజ్ డేట్. సీనియర్ ఎన్టీఆర్‌ నటించిన గులేబకావళి కథ ఇదే తేదీలో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే తేదీన రిలీజ్ అవుతోన్న రాఘవ రెడ్డి పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
చిత్ర నిర్మాత ఆర్.వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ఘంటా శ్రీనివాస్‌ ఆధ్వర్యలో ఈ మూడు సినిమాలను నిర్మించాం. ఇండస్ట్రీ నుంచి వ్యాపార రంగంలోకి వెళ్లాం. అక్కడ ఉంటూ మళ్లీ ఇక్కడ సినిమాలు చేస్తూ వచ్చాం. ఇక్కడ కళ్యాణ్‌గారు, ప్రసన్నగారు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు. రాఘవ రెడ్డి జనవరి 5న రిలీజ్ అవుతోంది. దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘‘రాఘవరెడ్డి సినిమా రూపంలో ఈ ఏడాది నాకొక మంచి దిశ, దశ ఉంటుందని భావిస్తున్నాను. సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మాస్ హీరో సినిమాలో ఎలాంటి అంశాలుంటాయో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. శివగారు ముప్పై నలబై సినిమాల అనుభవముున్న నటుడిగా పరిణితితో నటించారు. నిర్మాతలు సినిమా ప్రొడక్షన్ లో సపోర్ట్ అందించారు. తొమ్మిదేళ్ల తర్వాత నా దర్శకత్వంలోవస్తోన్న సినిమా ఇది. క్రిమినాలజీ ప్రొఫెసర్ గా శివ కంఠమనేని అద్భుతంగా నటించారు. జనవరి 5న రిలీజ్ అవుతోన్న రాఘవ రెడ్డి చిత్రం అందరి ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది. అందరికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైకోర్టులోనూ బెడిసికొట్టిన రాంగోపాల్ వర్మ "వ్యూహం"