Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీం తీర్పు... గౌతం అదానీ ఏమన్నారంటే...

Advertiesment
Adani
, బుధవారం, 3 జనవరి 2024 (13:26 IST)
ఆదానీ గ్రూపు అధిపతి గౌతమ్ ఆదానీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్ వివాదంలో ప్రత్యేక దర్యాప్తు సిట్ విచారణకు నో చెప్పింది. అదేసమయంలో సెబీ విచారణకు పచ్చజెండా ఊపింది. సెబీ దర్యాప్తుపై విశ్వాసం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పైగా, మీడియా రిపోర్టులపై ఆధారపడలేమని వ్యాఖ్యానించింది. అలాగే, వివాదంపై మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సెబీకి షరతు విధించింది. 
 
హిండెన్ బర్గ్ వివాదంలో అదానీ గ్రూపుకను క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. సెబీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సెబీ దర్యాప్తుపై విశ్వాసం ప్రకటించిన అపెక్స్ కోర్టు.. సిట్ దర్యాప్తు అక్కర్లేదని పేర్కొంది. కేసు బదిలీకి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదికపై మిగతా దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో మీడియా రిపోర్టులపై ఆధారపడలేమని వ్యాఖ్యానించింది. 
 
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరించింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ కెపెనీ గత యేడాది అదానీ గ్రూపుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్థిక అవకతవకలు పాల్పడినట్టు ఓ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక దేశంలో పెను దుమారాన్ని రేపింది. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణ చేపట్టింది. అయితే, ఈ అంశంపై సెబీ విచారణ సరిపోదని, సిట్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుధీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. 

అలాగే, ఈ వివాదంపై అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతం అదానీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఎన్నటికైనా నిజమే గెలుస్తుందని అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు మరోమారు నిరూపించిందన్నారు. ఈ వ్యవహారంలో తమకు మద్దతు నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ విజయం అందరిదని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటూ అదానీ గ్రూపు ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదానీ హిండెన్‌బర్గ్ కేసు.. సుప్రీం కోర్టు కీలక తీర్పు