Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భవతిని చేస్తే రూ.15 లక్షలు.. నమ్మితే నట్టేట మునిగినట్టే...

Pregnancy
, బుధవారం, 3 జనవరి 2024 (12:11 IST)
సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు రూ.15 లక్షలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇదేదో బాగుందని ఆశపడ్డారో.. నట్టేట మునిగిపోతారు. బ్యాంకులో ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాల్సివుంటుంది.  
 
ప్రస్తుతం సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. సైబర్ నేరగాళ్లు రోజురోజుగా రాటుదేలిపోతున్నారు. దీంతో కొత్త పంథాను ఎంచుకుంటూ అమాయకులను మోసం చేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. తాజాగా మహిళకు గర్భంచేస్తే రూ.15 లక్షలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆఫర్. 
 
తాము ఐశ్వర్యవంతులమే అయినా సంతాన లేని లోటును తమను వేధిస్తుంది. అందువల్ల ఇలాంటి అభ్యర్థన చేయాల్సివస్తుందంటూ పాచిక వేస్తారు. పొరపాటున ఎవరైనా ఆవేశపడితే మాత్రం ఉన్నదంతా ఊడ్చిపారేస్తారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఇలాంటి మోసాలకు బారినపడి బాధితులుగా మిగిలిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. భార్యాభర్తలుగా నటిస్తూ సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ఇలా అభ్యర్థిస్తే ఆవేశపడొద్దని, దానిని మోసంగా భావించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం - 14 మంది మృతి