కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ట్రక్, లారీ డ్రైవర్లు మంగళవారం సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏప్పడింది. వాహనాల్లో పెట్రోల్ లేకపోవడంతో అనేక మంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఇలాంటి వారిలో జొమాటో సంస్థకు చెందిన ఓ డెలివరీ బాయ్‌కు వినూత్న ఆలోచన వచ్చింది.
కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ఆహార పదార్థాలను హోటల్ నుంచి తీసుకుని, గుర్రంపై వెళ్లి సకాలంలో డెలవరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ దృశ్యం హైదరాబాద్ నగరంలోని చెంచల్‌గూడ వద్ద ఇంపీరియల్ హోటల్ సమీపంలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో జాతీయ మీడియాతో పాటు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.